అల్లు స్నేహరెడ్డి పై కామెంట్స్ చేసిన ప్రీతమ్ జుకల్కర్?

సమంతా విడాకులు అనంతరం సెలబ్రిటీ స్టైలిస్ట్ డిజైనర్ క్రితం జుకల్కర్ పేరు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంతా విడాకుల తరువాత వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నెటిజన్లు ప్రీతమ్ ని ట్రోలింగ్స్ కూడా చేశారు. వీరిద్దరి మధ్య బంధం పై క్లారిటీ ఇచ్చేశాడు ప్రీతమ్. తామిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ వంటి వారమని సమంత ని అక్క అని పిలుస్తాను అని అందరికీ తెలుసు అని రూమర్లకు చెక్ పెట్టేశాడు. అలాగే వారి మధ్య ఉన్న సంబంధం చైతన్యకు కూడా తెలుసని అన్నాడు.

అలాంటి రూమర్లు వచ్చినప్పుడు చైతన్య స్పందించకపోవడం, అలాగే ఆ రూమర్లను చైతన్య ఖండిచకపోవడం తనను ఎంతగానో బాధించింది అని పీతమ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ప్రీతమ్ కు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తో మంచి స్నేహ బంధం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, అర్హ, అయాన్ లు మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రీతమ్ హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వెళ్లినట్టు ఉన్నాడు. అతను సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. అలా జుట్టును కత్తిరిస్తుంటే నువ్వు కూడా ఇందుకు రెడీ గా ఉన్నావా అంటూ అల్లు స్నేహ రెడ్డి ని ట్యాగ్ చేశాడు. స్నేహ రెడ్డి మాత్రం అందుకు ఇంకా రిప్లై ఇవ్వలేదు.