నాని కొత్త సినిమాపై లీకులు..డైరెక్ట‌ర్‌గా శ్రీ‌కాంత్‌..?!

October 14, 2021 at 1:14 pm

ఇటీవ‌ల `ట‌క్ జ‌గ‌దీష్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని.. ఇప్ప‌టికే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో `అంటే.. సుందరానికి` అనే సినిమాను స్టార్ట్ చేసిన నాని.. మ‌రో సినిమాను ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

Top 5 performances by Nani | Entertainment News,The Indian Express

నాని 29వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న అనౌన్స్ చేయ‌బోతున్నారు. అయితే అనౌన్స్‌మెంట్ రాక ముందే.. ఈ సినిమాపై కొన్ని లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గ‌తంలో సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన శ్రీకాంత్‌.. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడ‌ట‌.

Speculation on Nani's 29 title and storyline

ఇటీవ‌లె శ్రీ‌కాంత్ త‌న క‌థ‌ను నానికి చెప్ప‌గా.. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పాడ‌ని స‌మాచారం. అంతేకాదు, సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ న‌డుస్తుంద‌ని.. ఇందులో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారని లీకుల వీరుల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.

నాని కొత్త సినిమాపై లీకులు..డైరెక్ట‌ర్‌గా శ్రీ‌కాంత్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts