ఈ స్టార్ హీరోకి ఎదురొచ్చే స్టార్ ఉన్నాడా.. ఒక్క ఏడాది.. 500 కోట్ల సంపాదన..!

October 14, 2021 at 1:16 pm

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన సాహో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీలో ఖాళీ అనే మాటే లేదు. అంత బిజీగా మారిపోయాడు. ప్రభాస్ ఒక్కొక్క సినిమాకు 70 నుంచి 100 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. ఇండియాలో ఈ రేంజిలో పారితోషికం అందుకుంటున్న మరొకరు హీరో లేరు. 2021 సంవత్సరం లోనే ప్రభాస్ నాలుగు సినిమాలకు సంతకాలు చేశాడు. వీటి ద్వారా ప్రభాస్ 400 నుంచి 500 కోట్ల సంపాదన ఆర్జించనున్నట్లు సమాచారం.

తనకొచ్చిన ఆదాయం ద్వారా ప్రభాస్ తన సన్నిహితులైన నిర్మాతల ద్వారా సినిమాల్లో పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు, విదేశాల్లో హోటల్ బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభాస్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా సంక్రాంతికి విడుదల కానుండగా..ఆది పురుష్, సలార్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే, సందీప్ దొంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాలు త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నాయి.

ఈ స్టార్ హీరోకి ఎదురొచ్చే స్టార్ ఉన్నాడా.. ఒక్క ఏడాది.. 500 కోట్ల సంపాదన..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts