`గే`గా మార‌బోతున్న నాని..అస‌లు మ్యాట‌రేంటంటే?

ఈ మ‌ధ్య `ట‌క్ జ‌గ‌దీష్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన‌ న్యాచుర‌ల్ నాని.. ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే.. సుందరానికీ..` ఒక‌టి. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

Ante Sundaraniki OTT Release date - Digital & Satellite Rights Bagged By Zee

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ మ్యాట‌రేంటంటే.. ఈ మూవీలో నాని గే పాత్ర‌లో కొంత స‌మ‌యం పాటు క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

Nazriya Nazim begins shooting for Nani's Ante Sundaraniki, says first is always special - Movies News

అంతేకాదు, గేగా నానీ పండించనున్న కామెడీ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం..? ఒక‌వేట నిజంగానే నాని గేగా న‌టిస్తే ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడు..? అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుండ‌గా.. వ‌చ్చే ఏడాది సినిమాలు విడుద‌ల కానుంది.