గాయాలపాలైన హీరో రామ్.. ఏమైందంటే..?

హీరో రామ్ అందరి అమ్మాయిల కలల రాకుమారుడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇకపోతే ఎనర్జిటిక్ డాన్సులు, ఫైట్స్, పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే టాలీవుడ్ యంగ్ హీరోలలో రామ్ పోతినేని కూడా ఒకరు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తన లో ఉన్న మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు కనబరిచి, అమ్మాయిలకు మరింత చేరువయ్యాడు. ఇలా ఉండగా ఈ యువ కథానాయకుడి మెడకు గాయమైంది దీంతో ఆయన షూటింగ్ చేస్తున్న సినిమా కూడా ఆగిపోయింది..

పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమా కోసం తన లుక్ ను కూడా పూర్తిగా మార్చుకున్నాడు.. బాడీ షేప్ కూడా మారిపోయింది.. ఈ తరుణం లోనే ఆయన చేస్తున్న ఎక్సర్సైజులు కారణంగా మెడకు గాయమైంది.. దీంతో షూటింగ్ ఆగిపోయింది.ఇక మెడకు బ్యాండేజ్ వున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారుతోంది.

https://twitter.com/PulagamOfficial/status/1444911691230187523?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1444911691230187523%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fhero-ram-pothineni-shoot-halted-due-to-his-neck-injury-during-body-transformation-%2Farticleshow%2F86748474.cms