పెళ్లి పెటాకులకు కారణం ఇదేనా.. తప్పు సమంతదేనా?

గత కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడాకుల విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇదే విషయాన్ని నిజం చేస్తూ సమంత నాగచైతన్య తాజాగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి విడాకులకు సంబంధించిన విషయం ట్రెండ్ అవుతోంది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయింది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? విడాకులు తీసుకోవడానికి వెనుక అసలు ఏం జరిగింది? అసలు కారణం ఏమిటి? నాగచైతన్య సమంత విడాకులకు అసలు చిచ్చు ఏమిటి? వివరాల్లోకి వెళితే…

అవును మేము ఇద్దరం విడిపోతున్నాం.. అంటూ నాగ చైతన్య, సమంత వీరిద్దరూ వారి అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. చాలా రోజుల పాటు చర్చించుకున్న తర్వాత భార్య భర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దశాబ్దకాలంగా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి కఠిన సమయంలో మమ్మల్ని శ్రేయోభిలాషులు, అభిమానులు, అర్థం చేసుకోవాలని మీడియాను కోరుతున్నామని చైతు,సామ్ వెల్లడించారు.

వీరిద్దరూ విడాకులు తీసుకున్నాం అని ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో వీరిద్దరి విడాకుల విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న బంధం తగ్గింది అన్డానికి ఇటీవల వస్తున్న వార్తలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.సమంత కూడా అందుకు అనుగుణంగానే ప్రవర్తించింది. నాగార్జున బర్త్ డే కి రాకపోవడం, ఇటీవల లవ్ స్టోరీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం, అలాగే నాగచైతన్య కు చెప్పకుండా ముంబైకి వెళ్లి తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ఇలా వారి మధ్య సంబంధం తగ్గింది అని సమంత చెప్పకనే చెప్పింది. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో ఇరువురి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.