హీరోయిన్ శ్రియా మ్యూజిక్ స్కూల్ ప్రారంభం?

ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందుతున్న మ్యూజికల్ మూవీ మ్యూజిక్ స్కూల్. ఈ సినిమాను తెలుగు హిందీ భాషల్లో పాపారావు బియ్యాల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్మాన్ జోషి, శ్రియా సరన్ జంటగా నటిస్తున్నారు. ఇందులో సింగర్ షాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇందులోని 12 సాంగ్స్ తో అన్నిటికీ సంబంధించిన రిహార్సల్ ను హైదరాబాదు నిర్వహించనున్నారు. ఇక హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే, అలాగే ఆయన అసోసియేట్ పాల్ సౌండర్ ఇందులో భాగం అవుతున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు పాపారావు మాట్లాడుతూ.. నేటి విద్యా వ్యవస్థ లో సృజనాత్మకత లేకుండా పోతోంది. విద్యార్థులను ఇంజనీర్లు డాక్టర్లు చేయడమే లక్ష్యంగా చేసుకుని విద్యను మూస పద్ధతుల్లో బోధిస్తున్నారు. దీంతో పిల్లల్లో తెలియని ఒత్తిడి నెలకొంటోంది. అలాగే పిల్లలకు చదువే లోకం అయిపోతుంది. కాబట్టి చదువుతోపాటు కళలు, ఆటలు కూడా జీవితంలో భాగమే ఈ సినిమా ద్వారా తెలియజేయపోతున్నాం అని తెలిపారు. ఇందులో మ్యూజిక్ దానికి సంబంధించిన విజువల్స్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి.సినీ రంగానికి చెందిన వ్యక్తిగా బ్రాడ్ వే మ్యూజికల్స్ కు నేను కూడా ఆకర్షితుడినయ్యాను అని తెలిపారు.