రోజా భర్త బర్త్ డే సెలబ్రేషన్స్..?

సినీనటి, ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది.అలాగే బుల్లితెరపై జరిగే పలు ఈవెంట్స్ జడ్జిగా కూడా వ్యవహరిస్తూ, మధ్య మధ్యలో తన ఆటలతో పాటలతో అలరిస్తూ ఉంటుంది.

రోజా తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మన ఫ్యామిలీ కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.

పండుగలు, ఫంక్షన్లు, కుటుంబ సభ్యుల బర్త్ డే వేడుకలకు మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ, మరొక వైపు జడ్జిగా వ్యవహరిస్తూ, మరొకవైపు పొలిటికల్ కి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటుంది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా రోజా భర్త ఆర్కే సెల్వమణి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్టులను షేర్ చేసింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బర్త్ డే వేడుకలు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే సెల్వమని కి పలువురు సినీ ప్రముఖులు కూడా బర్త్డే విషెస్ తెలియజేశారు.