డిజాస్టర్ గా మిగిలిపోయిన ఆరడుగుల బుల్లెట్.. ఎన్ని కోట్లు లాస్ అంటే..?

గోపీచంద్ నయనతార హీరోహీరోయిన్లుగా బి. గోపాల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఆరడుగుల బుల్లెట్.ఈ సినిమా వాస్తవానికి 2017 వ సంవత్సరం లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది 2021 వ సంవత్సరం లో విడుదలైంది. ఇక ఈ సినిమా మొదలు పెట్టి దాదాపుగా పది సంవత్సరాలు అయ్యింది. ఇక ఈ సినిమాని ఎక్కువగా ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయితే ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఈ సినిమా ముగిసే సమయానికి ఎంత కలెక్షన్ రాబట్టింది ఒక సారి చూద్దాం.

1). నైజాం-43 లక్షలు
2). సీడెడ్-22 లక్షల
3). ఈస్ట్-15లక్షలు.
4). వెస్ట్-11 లక్షలు
5). ఉత్తరాంధ్ర-27 లక్షలు
6). గుంటూరు-13 లక్షలు
7). కృష్ణ-11లక్షలు
8). నెల్లూరు-10 లక్షలు

ఈ చిత్రం ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో కలెక్షన్లు..1.52 కోట్ల రూపాయలను రాబట్టాయి.

ఇక వరల్డ్వైడ్గా కలెక్షన్ల విషయానికి వస్తే..1.63 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..2.95 కోట్ల రూపాయల జరగగా.. ఈ సినిమా ముగిసే సమయానికి 1.63 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్లకు 1.37 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది.