మాకు విష్ణు తో సమస్య లేదు కానీ ఆ ఒక్కడి వల్లే అంటున్న శ్రీకాంత్..?

మా ఎన్నికల ఫలితాలు ఇప్పుడు క్రమంగా వివాదాస్పదమైన వాక్యాలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ప్రకాశ్ రాజ్ చానల్ నుంచి 11 మంది సభ్యులు రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ నరేష్ తోనే సమస్య అని గుర్తించామని తెలియజేశారు.

ఆయనతో సమస్య ఆయనతోనే పనిచేయడం సెట్ అవ్వదు అంటూ వ్యాఖ్యలు చేశారు. మేము తప్పు చేసాము అని అనుకున్నా పర్వాలేదు.. ఇప్పుడే తప్పుకుంటానని ప్రకటన చేశారు. ఒకే దాంట్లో రెండు ప్యానెల్ సభ్యులు పని చేయడం కుదరదని తెలియజేశారు. అందుచేతనే పూర్తి బాధ్యత అంతా విష్ణు ప్యానల్ కే ఇస్తున్నాము అన్నట్లుగా తెలియజేశారు శ్రీకాంత్.

నరేష్ చాలా అద్భుతంగా ఎన్నికలు జరిపించాడు నరేష్ గారి దగ్గర నుండి మాని నడిపిస్తారని అనుకుంటున్నాం. ఆయన ఉన్నచోట మేము పని చేయలేము అని స్పష్టంగా తెలియజేశారు శ్రీకాంత్. అంతేకాకుండా మాలో మాకు చాలా బాధలు ఉన్నాయ్ అని చెప్పుకొచ్చారు