మా లో మెంబర్షిప్ లేని అడవి శేషు..!!

అడవి శేషు.. సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో అందరిని ఆలరిస్తున్న హీరో అని చెప్పవచ్చు. ముఖ్యంగా అడవి శేషు..ఎలాంటి కథను ఎన్నుకున్నప్పటికీ ఆ కథకు పూర్తి న్యాయం చేసి 100% రిజల్ట్ ని పొందుతాడు అని బిరుదు కూడా ఉంది.. ఇకపోతే అడవిశేషు గురించి కొన్ని సంచలన విషయాలు బయట పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఎందుకంటే సినీ ఇండస్ట్రీ లో నటించే నటీనటులు ఎవరైనా సరే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తప్పకుండా సభ్యత్వం కలిగి ఉండాల్సిందే.. ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరికీ ఎటువంటి కష్టం నష్టం కలిగినా ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. సినీ ఇండస్ట్రీలో ఇతరుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా అధ్యక్షుడికి ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అడవిశేషు ఇప్పటివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందలేదట.

ఇందుకు గల కారణం ఏమిటో తెలియదు కానీ, ఇప్పుడు ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది అంటే.. మొన్న జరిగిన మా అధ్యక్ష పదవి ఎలక్షన్లలో అడవి శేషు ఓటు వేయడానికి హాజరు కాలేదు.. ఇక ఎందుకు ఏం జరిగింది అనే విషయంపై ఆరా తీయగా ఆయనకు మా లో సభ్యత్వం లేదని తెలిసింది.. ఇకపైనైనా మాలో సభ్యత్వం తీసుకోవాలని సీనియర్ నటులు అడవి శేషు కు చెప్పినట్టు సమాచారం.