ఇక మీదట నిరుపేదల కోసం అలాంటి పని చేస్తా అంటున్న ఆర్యన్ ఖాన్?

October 18, 2021 at 9:11 am

బాలీవుడ్ నటుడు హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ పేరు మార్మోగిపోతోంది. ఇక ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయిన ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎం సి బి అధికారులు తాజాగా కౌన్సిలింగ్ ఇచ్చారు.చెడు మార్గాలు పట్టకుండా ఇకపై నిరుపేదల అభ్యున్నతి కోసం పని చేస్తానని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తెలిపారు.

ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాక మీరంతా గర్వపడేలా మంచి పనులు చేస్తానని ఆర్యన్ ఎన్సీబి డైరెక్టర్ సమీర్ వాంఖేడేకు హామీ ఇచ్చినట్టు ఒక అధికారి వెల్లడించారు. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి కోసమే పని చేస్తానని.. చెడు మార్గాలలో నడవని ఆయన తెలిపినట్లుగా అధికారి తెలిపారు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్సీబీ అధికారులు కలిసి ఆర్యన్ ఖాన్ అతని స్నేహితులకు జైలులో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై కోర్టు ఈ నెల 20న తీర్పును వెలువరించనుంది.

ఇక మీదట నిరుపేదల కోసం అలాంటి పని చేస్తా అంటున్న ఆర్యన్ ఖాన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts