జగపతి బాబుల శ్రీకాంత్ సక్సెస్ అవుతాడా..?

టాలీవుడ్ హీరోలలో ఎంతో మంది హీరో నుంచి విలన్ గా మారిన వారు ఉన్నారు. కొంతమంది హీరోగా సక్సెస్ కాకపోయినా విలన్ గా బాగా సక్సెస్ అయ్యారు. ఇలాంటివారిలో హీరో నుంచి విలన్ గా మారిన వాళ్లలో ఇప్పుడు శ్రీకాంత్ కూడా ఒకరు. ఈయన బాలకృష్ణ తో అఖండ మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు.

ఇక హీరోగా శ్రీకాంత్ అదరగొట్టినప్పటికీ.. విలన్ గా ఎలా రాణిస్తున్నాడు అనే విషయం పై బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ మాత్రం సినీమా కెరియర్లో ఈ పాత్ర ఒక చేంజర్ గా ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. తను చేసే సినిమాలో చాలా పచ్చిగా కఠినంగా ఉండాలని చెప్పుకొస్తున్నాడు.

ఇక అఖండ సినిమాని దసరా బరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే శ్రీకాంత్ కి జగపతిబాబు లా విలన్ పాత్ర కలిసి వస్తుందా లేదా అనే విషయం కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. జగపతి బాబు కూడా మొదట్లో సాఫ్ట్ గా కనిపించినా రానురాను కఠినమైన విలన్ పాత్రలు చేసి మెప్పిస్తున్నారు.