హీరో సిద్ధార్థ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `బాయ్స్` సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువైన సిద్ధు.. తెలుగు, తమిళ భాషల్లో లవర్ బామ్గా బాగానే ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంతో తెరకెక్కిన `మహా సముద్రం` చిత్రంలో ఒక హీరోగా నటించారు. ఈ మూవీ అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఇక సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈయనకు పెళ్లైంది అన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదు. 2003 వ సంవత్సరంలో న్యూఢిల్లీలోని తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే అమ్మాయిని సిద్ధార్థ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఈ జంటకు మొగ్లీ అనే కుమారుడు కూడా జన్మించారు. అయితే పెళ్లైన కొన్నేళ్లకే విభేదాలు రావడంతో మేఘన-సిద్ధార్థ్ లు 2007లో విడాకులు తీసుకున్నారు. ఇక మేఘనా తో విడిపోయిన తరువాత సిద్ధార్థ్ మరో వివాహం చేసుకోకపోయినా.. తనతో నటించిన పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాలు మాత్రం ఏ రేంజ్లో నడిపాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.