అంద‌రి ముందూ త్రిషను కొట్టిన‌ డైరెక్ట‌ర్‌..కార‌ణం ఏంటంటే?

October 9, 2021 at 12:46 pm

త్రిష.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ మొద‌ట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి.. ఆపై తమిళ సినిమా `జోడీ`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించింది. ఇటు తెలుగులో `నీ మనసు నాకు తెలుసు` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది.

Actress Trisha opens up about her marriage plans | Tamil Movie News - Times of India

త్రిష సినీ ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. అయిన‌ప్ప‌టికీ ఈ భామ సినిమాల‌తో బిజీ బిజీగానే గ‌డుపుతోంది. అయితే త్రిష త‌న ఇర‌వై ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. అనేక వివాదాల్లోనూ చిక్కుకుంది. ఇక ఒక డైరెక్ట‌ర్ అయితే త్రిష‌ను వస్త్రధారణ విష‌యంలో అంద‌రి ముందూ కొట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Trisha-Varun manian: Why is Trisha in tears? | Tamil Movie News - Times of India

త్రిష సైన్ చేసిన ఓ సినిమా షూటింగ్ లో ఎంతో సాంప్ర‌దాయంగా పూజాకు సంబంధించిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. అయితే సరిగ్గా అప్పుడే త్రిష చిట్టి పొట్టి బ‌ట్ట‌లు ధ‌రించి ఫుల్ ఎక్స్‌పోజింగ్ చేస్తూ లొకేష‌న్‌కి వెళ్లిందట‌. దాంతో ఆగ్ర‌హించిన డైరెక్ట‌ర్‌.. బుద్ధుందా, ఎప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి అన్న సెన్స్ కూడా లేదా అంటూ అంద‌రి ముందూ త్రిష‌పై చేయి చేసుకున్నార‌ట‌. దాంతో కోప‌గించుకున్న త్రిష వెంట‌నే ఆ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రుగుతుంది.

అంద‌రి ముందూ త్రిషను కొట్టిన‌ డైరెక్ట‌ర్‌..కార‌ణం ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts