ఆనంద్ దేవరకొండ హైవే సినిమా షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?

హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హైవే. ఈ సినిమాకు కె.వి.గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైకో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది.తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించిన నిర్మాత వెంకట్ తలారి ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఈ హైవే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్ తో కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా హైవే సినిమా షూటింగ్ పూర్తయింది.

ఈ సందర్భంగా మూవీ మేకర్ పోస్టర్ ను విడుదల చేస్తూ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు. ఈ గ్రామంలో నిర్మాత వెంకట్ తలారీ మాట్లాడుతూ.. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బేనర్ పై ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా హైవే సినిమా రూపొందుతోంది. ఆనంద్ దేవరకొండ మనసు రాధాకృష్ణన్ హీరో హీరోయిన్ గా నటించారు. హైవే సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో జరిపాం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు. దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో టెక్నికల్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. సినిమా మొత్తం ప్రతి క్షణం ట్విస్ట్, టర్న్ లతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.