పోసాని పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు..!

October 9, 2021 at 7:37 am

రేపు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రకాష్ రాజు బ్యానర్ మంచు విష్ణు ఫైనల్ పోటీపడుతున్నాయి. ఈ రెండు ఫైనల్స్లో ప్రకాష్ రాజు ఫైనల్ కి మెగా బ్రదర్ నాగబాబు తన మద్దతును తెలియజేశారు. ఇక అంతే కాకుండా ప్రకాష్ రాజు కి సపోర్ట్ చేస్తూ కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇది ఈ క్రమంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్లైన్ టికెట్ గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై చేసిన కొన్ని వాక్యాలను స్పందించారు.

అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పే ఈ విషయాలను నేను కచ్చితంగా ఫాలో అవుతాను అని ఎందుకంటే వాళ్లు మంచి మాటలే చెబుతారని తెలియజేశాడు నాగబాబు. పోసాని అలా మాట్లాడడం పై మీరు ఎలా స్పందిస్తారు అని అడిగితే.. కొందరి పేర్లు నా నోటితో చెప్పి నా నోరు పాడు చేసుకోలేను అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఇక మా ఈ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో రాజకీయ పార్టీల హస్తం ఉందా అని అడగగా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది కేవలం 900 మంది కల సభ్యులున్న ఒక చిన్న సంస్థ. ఇలాంటి దానిలో రాజకీయ పాత్ర ఉందంటే ఒప్పుకోం అని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా ముందు నుంచే మెగా ఫ్యామిలీ అంతా ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచారని తెలియజేశారు.

పోసాని పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts