ర‌హ‌స్యంగా బిడ్డ‌ను క‌న్న శ్రియ‌..అన్యాయ‌మంటున్న ఫ్యాన్స్‌!

అందాల భామ శ్రియ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చ‌క్రం తిప్పిన శ్రియ‌.. తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాష‌ల్లోనూ న‌టించి మెప్పిచింది. ఇక 2018లో రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను పెళ్లాడిన శ్రియ‌.. 2020లో ర‌హ‌స్యంగా పండంటి ఆడ‌బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది.

Pics From Shriya Saran And Andrei Koscheev's Wedding Album

తాజాగా ఆ అతిపెద్ద సీక్రెట్‌ను స్వ‌యంగా శ్రియ‌నే రివిల్ చేసింది. `2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కోవిడ్‌ కారణం‍గా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్‌ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను` అంటూ సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.

Shriya Saran shares clip, says she is 'at home in Barcelona' - DTNext.in

ఈ సంద‌ర్భంగా బేబీ బంప్‌కి సంబంధించిన ఫొటోలు, తన చిన్నారితో ఆడుకుంటున్న వీడియోని సైతం పోస్ట్ చేసింది. అయితే ప్రెగ్నెన్సీని, బిడ్డ పుట్టిన విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌క‌పోవ‌డంతో.. శ్రియ అభిమానులు `ఇది అన్యాయం, ఇంత మంచి గుడ్‌న్యూస్ చెప్ప‌డానికి ఇన్ని రోజులు వెయిట్ చేయాలా..?` అంటూ స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CU5GnpSsaSB/?utm_source=ig_web_copy_link