సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాక్టర్ అజయ్ ఘోష్ ఆడియో లీక్?

October 5, 2021 at 12:33 pm

నటుడు అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మనందరికీ సుపరిచితమే. అయితే ఇతను ఒక మహిళ తో మాట్లాడిన ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ మహిళ నేను నువ్వే అప్పడాల విజయలక్ష్మిని అంటూ అతన్ని డ్రాప్ చేయడానికి ప్రయత్నించింది. నేను అప్పడాల విజయలక్ష్మిని మీ వీధి చివర అప్పడాలు తయారు చేస్తుంటాను అని మాట్లాడింది.

అసలు విషయం చెప్పు అనగానే మారుతి గారు డైరెక్ట్ చేసిన మంచి రోజులు వచ్చాయి సినిమా లో మీరు ఫుల్ లెన్త్ రోల్ చేశారు అని నాకు తెలిసింది.ఆ సినిమా నవంబర్ 4న విడుదల చేయబోతున్నారట గా మీరు నన్ను ఆ సినిమాకు తీసుకెళ్లాలి అంటూ ఫోన్ లో మాట్లాడింది. దీపావళి రోజున నవంబర్ 4 మంచి రోజులు వచ్చాయి సినిమా కి తీసుకెళ్ల పోతే మీ జేబులో తుపాకులు పెట్టి వెలిగిస్తాను అంటూ అజయ్ ఘోష్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది.

అలాగే ఆమె రోజు ఇంట్లో వాళ్ళతో సినిమాలకు ఏం వెళ్తారు నాతో సినిమాకు రా అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. అంతేకాకుండా మీరు నన్ను సినిమాకి తీసుకెళ్లకపోతే మీరు నాతో చేసిన విషయాలన్నింటిని బయట పెడతాను అంటూ మాట్లాడింది. ఇవన్నీ చూస్తుంటే ఎవరో అజయ్ ఘోష్ ను డ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సందేహం రాక మానదు. అజయ్ గోష్ ఆమె అన్న మాటలను పట్టించుకోలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాక్టర్ అజయ్ ఘోష్ ఆడియో లీక్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts