రిపబ్లిక్ 4డేస్ కలెక్షన్స్ ఇవే.. గట్టెక్కడానికి ఇంకెంత వసూలు చేయాలంటే..!

October 5, 2021 at 12:11 pm

సాయిధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సినిమా అద్భుతంగా ఉందని.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని..ట్వీట్లు పెడుతుండగా.. సినిమా చాలా స్లోగా ఉందని ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదని మరికొందరు కంప్లైంట్ చేస్తున్నారు.రాజకీయ నాయకులకు అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, సీతక్క రిపబ్లిక్ మూవీని స్పెషల్ గా చూసి సినిమా బాగుందని కితాబిచ్చారు.

అలాగే నారా లోకేష్ కూడా సినిమా బాగుందని రివ్యూస్ వస్తున్నాయ్..అని కచ్చితంగా చూస్తానని ట్వీట్ చేశారు. అయితే సాయి తేజ్ గత సినిమాలతో పోలిస్తే రిపబ్లిక్ సినిమాకు తక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయి.ఈ సినిమా నాలుగు రోజులకు గాను రూ.6 కోట్లు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. రిపబ్లిక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ. 14 కోట్లు. సినిమా నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఇంకా సుమారు రూ.8 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే 8 వ తేదీ సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొండపొలం సినిమా విడుదలవుతోంది. కొండపొలం ఇప్పటికే ట్రైలర్, పాటలతో ఆకట్టుకుంది. భారీ అంచనాలతో విడుదలవుతోంది. దీనికితోడు దసరా సందర్భంగా మరికొన్ని సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో రిపబ్లిక్ మూవీ ఇక పుంజుకోవడం కష్టమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.

రిపబ్లిక్ 4డేస్ కలెక్షన్స్ ఇవే.. గట్టెక్కడానికి ఇంకెంత వసూలు చేయాలంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)