ఆయన వల్లే తన కొడుకు గెలిచాడు అంటున్న మోహన్ బాబు..!!

మా ఎన్నికల అనేది రాజకీయ వేదిక కాదు.. కేవలం కళాకారుల వేదిక అన్నది అంటూ మంచు మోహన్ తెలియజేశాడు. ఈ రోజున మంచు విష్ణు ప్రమాణ స్వీకరణకు హాజరైన మోహన్ బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు తెలియజేశారు. మనం రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలని కూడా సూచించారు. అందరం ఒకే తల్లి బిడ్డలం అంటూ కూడా ఆయన తెలియజేశారు.

సీనియర్ యాక్టర్ లకి నేను ఈరోజు కూడా గౌరవం ఇస్తూనే ఉన్నాను అంటూ మోహన్ బాబు తెలియజేశాడు. తన 47 సంవత్సరాల నట జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అని తెలియజేశాడు. మా లో రాజకీయాలు ఇలా కూడా ఉంటాయని ఇప్పుడు చూశాక నాకు అర్థం అయింది అంటూ తెలియజేశారు.

ఈ రోజున విష్ణు గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు మోహన్ బాబు. నా కోపం నాకే నష్టం కలిగించింది.. ఉన్నది ఉన్నట్లుగా చెబితే తప్పు పడుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. నా బిడ్డను మీ చేతిలో పెడుతున్న.. మంచి హీరో, మంచి నటుడని భారతదేశంలో గొప్ప పేరు తీసుకువచ్చే విధంగా విష్ణు పనిచేయాలని ఆయన తెలియజేశాడు.

Naresh In Trouble With Statements On Sai Dharam Tej

ఇక విష్ణు విజయానికి ముఖ్య సూత్రధారి నరేష్ అని తెలియజేశాడు. ఆయన షూటింగులు క్యాన్సిల్ చేసుకుని మరీ విష్ణు గెలుపు సహకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. హ్యాండ్సప్ టూ నరేష్.. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని తెలియజేశాడు.