ఆ స్టార్ హీరో చేతుల మీదుగా ఆకాష్ సినిమా ట్రైలర్..?

ఆకాష్ పూరి, కేతిక శర్మ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంతా పూరి జగన్నాథ్ అందించారు. ఈ సినిమాకి ప్రమోషన్ లో భాగంగా ఒక స్టార్ హీరో చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఆ హీరో ఎవరంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులమీదుగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.

Prabhas To Launch Romantic Trailer -
ఈ చిత్రం ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కు కూడా నిర్మాతగా చార్మి పూరి జగన్నాథ్, కలిసి నిర్మిస్తున్నారు. ఎలాగైనా సరే తన కుమారుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతోనే పూరి జగన్నాథ్ సినిమాని బాగా పాపులర్ చేయిస్తున్నాడు. అందు కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.