ఆ జబ్బుతో బాధపడుతున్న సుమ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత తెలుగు బుల్లితెర టెలివిజన్ ఫీల్డ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ. చాలా అద్భుతమైన టైమింగ్‌తో మలయాళీ అయినా కూడా ఆమె తెలుగులో వరుస షోలతో దూసుకుపోతోంది. తెలుగింటి కోడలుగా తనదైన శైలిలో అందరినీ అలారిస్తూ ఆకట్టుకుంది.. ఈమెతో మాట్లాడాలంటే సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా భయపడతారు.. ఎందుకంటే సుమ తన వాక్చాతుర్యంతో ఎంతటివారైనా ఇట్టే బోల్తాకొట్టించేస్తుంది కాబట్టి. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు కూడా సుమతో షో అంటే ముందుగానే ప్రిపేర్ అయి వస్తారట..ఈ విషయాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా చెప్పాడు..

ఇక పోతే సుమ ఒక జబ్బుతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదట..కానీ వ్యాధి అనేది దాచుకుంటే తరగదు అని చెప్పుకుంటే తగ్గిపోతుంది అన్న కారణంతో ఎట్టకేలకు ఇప్పుడు తనకున్న జబ్బు గురించి చెప్పడానికి ముందుకు వచ్చింది. అదేంటో మనం కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం..

యాంకర్ సుమ కీలాయిడ్‌ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నట్టు ఆమె తెలిపారు. ఆ సమస్య కారణంగా ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా మారుతుందని, చిన్న గాయం కూడా పెద్దదవుతుందని, త్వరగా తగ్గిపోదని చెప్పుకొచ్చింది. ఈ సమస్యను నయం చేసుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసినట్లు చెప్పిన సుమ, అయినా కూడా తగ్గలేదని, అదే ఇప్పుడు తన శరీరంలో భాగమైందని చెప్పింది.