సాయి తేజ్ కి మరో రెండు సర్జరీలు ..!

October 9, 2021 at 7:47 pm

నెల రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా సాయి తేజ్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సాయి దసరా పండుగ తర్వాతే సాయి తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వినాయక చవితి రోజున ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన సాయి తేజ్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ స్కిడ్ అయ్యి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సాయి ధరంతేజ్ అప్పట్నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నాడు.మొదట కాలర్ బోన్ విరగడంతో సాయి తేజ్ కు ఒక సర్జరీ చేశారు. ఆ తర్వాత సాయి తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వార్తలు వచ్చాయి.

అయితే సాయి ధరంతేజ్ ఎడమ భుజానికి తీవ్ర గాయం కావడంతో రెండుసార్లు సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం సాయి తేజ్ ఆస్పత్రిలోనే కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దసరా పండుగ తర్వాత ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు.

సాయి తేజ్ కి మరో రెండు సర్జరీలు ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts