తల్లి కావాలని సమంత ఆశ.. అక్కినేని ఫ్యామిలే అడ్డుకుంది.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత విడిపోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోవడానికి గల అసలు కారణాలేంటీ .. అనే విషయమై రకరకాల వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య సమంత పట్ల అలా ప్రవర్తించే వాడని.. అక్కినేని ఫ్యామిలీ సమంతకు కండిషన్స్ పెట్టిందని.. సమంత శృతి మించి సినిమాల్లో గ్లామర్ ప్రదర్శించిందని..ఇలా రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి.

అయితే సమంత, నాగచైతన్య విడిపోవడానికి గల కారణాలపై అటు అక్కినేని ఫ్యామిలీ కానీ, ఇటు సమంత ఫ్యామిలీ కానీ ఇంతవరకు వెల్లడించలేదు. కాగా తాజాగా సమంత, చైతన్య విడాకులపై టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత స్పందించింది. అక్కినేని ఫ్యామిలీ పై దారుణంగా కామెంట్స్ చేసింది. ‘ సమంత హిందూ దేవుళ్ళ పై తప్పుగా ఎప్పుడూ మాట్లాడలేదు. సినిమాల్లో సమంత వేసుకునే దుస్తుల వల్ల విడిపోయారనే వాదన సరికాదు. తల్లి కావాలని సమంత ఆశ.ఆమె తల్లి కాకుండా అక్కినేని కుటుంబం అడ్డుకుంది.

పెళ్లయిన ఒక రోబోలా సమంత పని చేసి డబ్బు సంపాదించింది. తాను సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తూ కూడా కుటుంబం నుంచి ప్యాకెట్ మనీ మాత్రమే తీసుకునేది. ఇన్ని దారుణాలు భరించడం కంటే సమంత విడిపోవడమే మేలైంది.’ అని మాధవీలత పేర్కొంది. అయితే మాధవీ లత చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు కూడా స్పందిస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయాల గురించి నీకెలా తెలుస్తాయని.. తెలియని విషయాల గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం తగదని కామెంట్స్ చేస్తున్నారు.