బుల్లి తెరపై నటించడానికి సిద్ధమవుతున్న నటసింహ బాలయ్య..!

నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం సినిమాలు.. రాజకీయాల వైపు మాత్రమే మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఈయన తండ్రి నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి నీరాజనాలు పట్టారో అంతే స్థాయిలో బాలకృష్ణను కూడా ఆదరిస్తున్నారు. సినిమాల పరంగా అటు రాజకీయాల పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ బుల్లితెర ప్రేక్షకులను మాత్రం ఇప్పటివరకు అలరించలేదు.

కొన్ని కొన్ని సార్లు వాణిజ్య ప్రకటనలు చేయమని అడిగితే ప్రజలకు ఉపయోగపడే టట్టు ఉంటే ఫ్రీ గా కూడా చేస్తానని తెలిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే మొట్టమొదటిసారిగా బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నాడు నటసింహం. ఒక ప్రోగ్రాం ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రోగ్రాం త్వరలోనే ఆహా వీడియో లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆకాశవాణి మీడియా ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా తెలిపింది.ఆ షో కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించడం గమనార్హం.