విడుదల తేదీని తెలిపిన భీమ్లా నాయక్..!

భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా నుంచి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే . ఎందుకంటే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో కేవలం మూడు వారాల్లోనే ఎక్కువ స్థాయిలో వ్యూస్ నమోదు చేసుకోవడమే ఈ సినిమాకు మరింత హైప్ కలుగుతుంది..

అంతేకాదు ఇటీవల కిన్నెర మొగలయ్యతో పాడించిన సినిమా టైటిల్ ను కూడా విడుదల చేయడంతో, మరింత పాపులారిటీని అందుకుంది ఈ సినిమా.. ఈ సినిమాలో సరికొత్త పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు కాబట్టి, పవర్ స్టార్ ని ఎప్పుడెప్పుడు చూస్తామంటూ ఆయన అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.. అంతేకాదు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, రానా ల ఇమేజ్ కూడా మరింత పెరిగిపోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమా టైటిల్ పాట కూడా సోషల్ మీడియా లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడం గమనార్హం.

ఇక ప్రేక్షకులు కూడా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న సినిమా కాబట్టి, వారు విడుదల కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా 2022 జనవరి 12 వ తేదీన సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేస్తామని ప్రకటించారు.