పుష్ప సినిమా నుంచి మరో సింగల్ రిలీజ్.. ఎప్పుడంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏదైనా కొత్త మూవీ చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా తన మూవీ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇక అలా వైకుంఠపురం లో చేసిన ప్రమోషన్స్ ప్రస్తుతం పుష్ప సినిమా విషయంలో కూడా అప్లై చేస్తున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ ఇండియా సింగల్ గా దాక్కో దాక్కో మేక పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఎక్కడ చూసినా కూడా ఇదే సాంగ్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వేడిని మరింత పెంచేందుకు ఈ సినిమా నుంచి మరో సింగిల్ లో రిలీజ్ చేసేందుకు ఈ చిత్రం యూనిట్ రెడీ అవుతోందట. సెప్టెంబర్ లో మరో న్యూ సింగిల్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్లానింగ్ కూడా జరిగిపోయింది. ఈసారి డ్యూయెట్ సాంగ్ ను సింగిల్ రూపంలో విడుదల చేస్తారట. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఇకపై ప్రతి నెల సింగిల్ రిలీజ్ కానుందట.