ఫోటోలు తీస్తే పగలగొట్టేస్తా.. బన్నీ వార్నింగ్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక కారణం చేత సినిమాలోని కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటల షూటింగ్, అనసూయ పాత్ర, అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇలా ఒక్కొక్కటి చిత్ర బృందానికి తెలియకుండానే ఎవరో దుండగులు లీక్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు లీకుల బెడద తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించారు.. కానీ దుండగులు మాత్రం వారి ఆకతాయి అలవాట్లను మార్చుకోలేక లేకపోతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్లు ఈ లారీ డోర్ పైన పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నట్లు ఒక ఫోటో ను ఎవరో లీక్ చేశారు.. దీంతో తీవ్రంగా కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడు అల్లు అర్జున్..

సినిమా షూటింగ్ లో ఎవరైనా ఫోటోలు తీస్తున్నట్లు తెలిస్తే వెంటనే పగలగొట్టేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.. అంతేకాదు “ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్” అనే బోర్డును కూడా సినిమా షూటింగ్ సెట్లో పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇక నుంచి అయినా జాగ్రత్త పెడతారో లేదో వేచి చూడాలి.