ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్ లో టెక్నాలజీ రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుందో, అదేవిధంగా మోసాలు,నేరాలు కూడా అదే విధంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసి లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి చదువుకున్న, చదువు రాని వారు సైతం మోసపోతున్నారు. నైజీరియన్ లు సోషల్ మీడియా వేదికగా ఈ విధమైన నేరాలకు ఎక్కువగా పాల్పడుతుంటారు. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కూడా దారుణంగా మోసం చేశారు.
ఆమె ఎవరో కాదు సోనాక్షి వర్మ. ఈమెకు ఫేస్బుక్ ఖాతాలో మెర్రిక్ కిరాక్ అనే పేరుతో రిక్వెస్ట్ రాగా, దాన్ని యాక్ట్ చేసింది సోనాక్షి. ఆ తరువాత వారిద్దరి మధ్య వ పరిచయం చాటింగ్ వరకు వెళ్ళింది. అలా వారి మధ్య స్నేహబంధం ఏర్పడటంతో తన స్నేహానికి గుర్తుగా మెర్రిన్ తనకి ఒక కానుక పంపిస్తాను అని చెప్పాడు. ఈ కానుక ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు వస్తుందని అక్కడికి వెళ్లి తీసుకోవాలని తెలిపారు. ఆ తర్వాత మరొక వ్యక్తి ఆమె కు కాల్ చేసి మెర్రిన్ అనే వ్యక్తి మీకు బహుమతి పంపారు దాన్ని హైదరాబాద్ కు పంపాలంటే 85 వేలు కట్టవలసి వస్తుంది అని చెప్పడంతో, అతని మాటలు నమ్మి ఆమె 85 వేలు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత రోజులు గడుస్తున్నా బహుమతి తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సైబర్ పోలీసులను ఆశ్రయించింది.