పవన్ కళ్యాణ్ కి ఆ విధంగా విషెస్ చెప్పిన వర్మ?

టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాస్త భిన్నమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఈయన నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ అంటే మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు చెప్పిన బర్త్ డే విషెస్ చర్చనీయాంశంగా మారింది. అందులోనూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆశు రెడ్డి టాటూ ఫోటోను పోస్ట్ చేసి విషెస్ చెప్పారు. దీనితో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవలే ఆశు రెడ్డి వర్మ ను ఇంటర్వ్యూ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో వర్మ ఆశు రెడ్డి బ్యాంగిల్స్ లో ఫోటో తీస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఆశు రెడ్డి సీక్రెట్ ప్లేస్ లో వేసుకునే టాటూ ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తరఫున ఆయనను అభిమానించే ఆశు రెడ్డి తరఫున పవన్ కళ్యాణ్ కు హ్యాపీ బర్త్డే అలాగే ఆశు రెడ్డి నాతో చేసిన ఇంటర్వ్యూ ప్రోమో సెప్టెంబర్ 2 సాయంత్రం 6 గంటలకు విడుదల అవుతుంది. జై పవన్ కళ్యాణ్ జై ఆశు రెడ్డి అంటూ వర్మ పోస్ట్ లో తెలిపారు. ఇలా ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.