మెగా ఫ్యామిలీ సహాయం తీసుకోనున్న నాగార్జున.. కారణం ఏంటంటే?

అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో నలుగురు అగ్రహీరోల లో హీరో నాగార్జున కూడా ఒకరు. ఇక మిగతా ముగ్గురు చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్. ఈ మిగతా ముగ్గురు హీరోలకు ధీటుగా సినిమాలను చేసేవారు నాగార్జున. కానీ రాను రాను మిగతా ముగ్గురు ముందు నాగార్జున జోరు నిలవలేకపోయింది. ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాలను అందుకున్నప్పటికీ మార్కెట్లో ఆయన ఫాలోయింగ్ క్రేజ్ బాగా దెబ్బతీశాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ డమ్ అంతగా పని చేయట్లేదు. అంతే కాకుండా నాగార్జున కొడుకులకు కూడా అతని అండ సరిపోవడం లేదు.

నాగార్జున ఎంత ప్రయత్నించినప్పటికీ తన చిన్న కొడుకు అఖిల్ ను హీరోగా నిలబెట్టే లేకపోయారు. ఆయన ప్లాన్ చేసిన తొలి మూడు సినిమాలు పరాజయాలు పాలవగా, అందులో ఎంతో శ్రద్ధ పెట్టి దగ్గర్నుంచి తీయించిన హలో సినిమా కూడా పరాజయం పాలయ్యే పరిగి నాగార్జున కొడుకు కోసం మెగా గడప తొక్కాడు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను చేయించారు. గతంలో నాగచైతన్య కూడా స్ట్రగ్గుల్ అవుతున్నప్పుడు ఇదే బ్యానర్ లో 100 పర్సెంట్ లవ్ సినిమా చేయించడం జరిగింది. అంతే కాకుండా తన సినిమాలకు అలాగే తన కొడుకు సినిమాలకు నాగార్జున ప్రమోషన్స్ పరంగా కూడా మెగా బ్రాండ్ వాడుతుండటం గమనార్హం.

ఇక వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ ముంగిట ప్రచారం కోసం నాగ్ చిరంజీవి సపోర్ట్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తన పెద్ద కొడుకు నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెంటబెట్టుకుని వస్తున్నాడు నాగ్. ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ చిరంజీవి అతిధిగా రప్పించడం ఆశ్చర్యమే. ఇక ఇది చూసిన వారు అక్కినేనివారి మెగా వాడకం మామూలుగా లేదని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.