మొగలయ్యకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం గా అంత ఇచ్చాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సహాయానికి పెట్టింది పేరు.ఇక ఈయన గొప్ప మనసును చాటుకున్నారు ఇప్పుడు.అది ఎలా అంటే భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన మొగులయ్య కు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమయ్యాడట పవన్ కళ్యాణ్.

కిన్నెర కళాకారుడైన మొగులయ్య..భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత ఈయన పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.ఇక ఈయన ఆర్థిక కష్టాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలో ఈయనకు రెండు లక్షల రూపాయల చెక్కు అందించడం పోతున్నట్లు అధికారికంగా సమాచారం వెలువడింది.

ఈ అరుదైన కళాకారుడు తెలంగాణలోని అమ్రాబాద్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందినవారు. జానపద కళ రూపాలు మారుతున్న కాలంతో పాటే కనుమరుగవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.మొగులయ్య ప్రతిభను ప్రోత్సహించాలి అంటే ఆయన ఆర్థికంగా బాగుండాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి పని చేశాడు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది.

ఇక అంతే కాకుండా మొగల్ అయ్య ఆర్థిక కష్టాలను తెలుసుకుని పోసాని కృష్ణ మురళి కూడా ఆయనకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఏది ఏమైనా మన ఇండస్ట్రీలో ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం మన హీరోలకే సాధ్యం అని చెప్పవచ్చు.