నాని నటించిన ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాని ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నాని నటించిన సినిమాలు అన్ని కామెడీ గానూ, కొంచెం త్రిల్లింగ్ గానూ ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే నాని నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రం విడుదలై ఈ రోజుకు ఆరు సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేసిందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

మతిమరుపు కాన్సెప్ట్ తో చేసిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా 2015 సెప్టెంబర్ 4న విడుదలైంది. ఇక ఇప్పటికీ ఈ సినిమా విడుదలై 6 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇక ఈ సినిమా ఎన్ని కోట్లు లాభం ని తెచ్చిపెట్టిందో ఒకసారి చూద్దాం.

1). నైజాం-7.10కోట్ల రూపాయలు.
2). ఉత్తరాంధ్ర-2.15కోట్ల రూపాయలు.
3). సీడెడ్-2.10కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.55కోట్ల రూపాయలు.
5). గుంటూరు-1.65కోట్ల రూపాయలు.
6). వెస్ట్-1.5కోట్ల రూపాయలు.
7). నెల్లూరు-50లక్షలు.
8). కృష్ణ-1.30కోట్ల రూపాయలు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలుపుకొని మొత్తం కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి..17.40కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
9). రెస్టాఫ్ ఇండియా-3.60కోట్ల రూపాయలు.
10). ఓవర్సీస్-6.11కోట్ల రూపాయలు.
11). వరల్డ్ వైస్ టోటల్ కలెక్షన్–27.11కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ ప్రకారం చూసుకుంటే.. రూ.14.6 కోట్ల.. ఇక ఈ చిత్రం ముగిసేసరికి మొత్తంగా చూసుకుంటే రూ.27.11 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా బయ్యర్లకు 12 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది.