మన స్టార్ హీరోల గురువు ఇతనే నట..?

మన స్టార్ హీరోలు హీరో ఎదగడానికి ఎంతో కష్ట పడుతూ ఉంటారు.అలా ఎదగడం కోసం ఎవరో ఒకరిని ఇన్స్పైర్ గా తీసుకుని ఉంటారు.అలా మన స్టార్ హీరోలు.. హీరోలుగా ఎదగడానికి ఒక గురువు ఉన్నారట ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మహేష్ బాబుతో సత్యానంద్ Photo : Twitter

లంక సత్యానంద్ అంటే..ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ మన టాలీవుడ్ లో కొంత మంది స్టార్స్ ను సైతం తీర్చిదిద్దిన ఘనత ఈయనదే.టీచర్స్ డే సందర్భంగా ఈయన గురించి స్పెషల్ స్టోరీ తెలుసుకుందాం.సత్యా నందుకు చిన్నతనం నుండి నాటక రంగంలో బాగా అనుభవజ్ఞుడు.ఈయన నాటక రంగం మీద మక్కువ తోనే..1979 లో”కళా జ్యోతి”అనే సంస్థను స్థాపించారు.

పవన్ కళ్యాణ్‌తో సత్యానంద్ Photo : Twitter

అంతేకాకుండా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశారు.ఆ తరువాత స్టార్ చిరంజీవి సలహా మేరకు సత్యాన్న యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు.అలా స్టార్ట్ చేసిన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో మొదటి విద్యార్థి పవన్ కళ్యాణ్, రెండవ విద్యార్థి ప్రభాస్,ఆ తర్వాత మహేష్ బాబు ఇలా ఎందరో స్టార్స్గా చేసిన ఘనత ఈయనకే దక్కింది.

 పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్‌‌