బిగ్‌బాస్ 5: వామ్మో..మూడు వారాల‌కే ల‌హ‌రి అంత పుచ్చుకుందా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ వీక్ స‌ర‌యు, సెకెండ్ వీక్ ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. ఎన్నోఆశ‌ల‌తో హౌస్‌లోకి అడుగు పెట్టిన ల‌హ‌రి మూడు వారం బ్యాగ్ స‌ద్దేసింది.

మూడు వారాలు హౌస్ లో ఉన్న లహరి ఎంత తీసుకున్నారంటే? | bigg boss season 5 last  week eliminated contestant lahari remuneration leaked

అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ల‌హ‌రి మూడో వార‌మే ఎలిమినేట్ కావ‌డం అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇదిలా ఉంటే.. హౌస్ లో ఉన్నన్ని రోజులకుగాను లహరి అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Bigg Boss 5 Telugu Lahari Shari: అసలు ఎవరు ఈ లహరి షారి.. ఎక్కడ్నుంచి బిగ్  బాస్‌కు వచ్చింది..?

వారానికి లక్షన్నర నుండి రెండు లక్షల ఒప్పందంపై హౌస్ లోకి వెళ్లిన ల‌హ‌రి.. మూడు వారాల‌కు గానూ ఐదు నుండి ఆరు లక్షల వరకు రెమ్యూనరేషన్ గా పుచ్చుకుంద‌ట‌. కాగా, బిగ్‏బాస్ ఇంట్లోకి వెళ్లినప్పటినుంచి చీటికీ మాటికీ ఇతర కంటెస్టెంట్స్‌తో గొడవలు పెట్టుకోవ‌డం, అతి అవేశం, బాత్రూమ్‌లో ర‌విని హ‌గ్ చేసుకుంద‌ని ప్రియ ఓపెన్‌గానే చెప్పేయ‌డం.. ఇవ‌న్నీ ల‌హ‌రి ఎలిమినేషన్‌కు కార‌ణాలు అయ్యాయ‌ని టాక్‌.