కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఖరీదు ఎంతో తెలుసా..?

నీటికి రంగు ఉండదు కదా..! మరి బ్లాక్ వాటర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? సాధారణంగా మనం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో నేర్చుకున్న విషయమే నీటికి రంగుండదు..అని, కానీ ఇటీవల బ్లాక్ వాటర్ అనే కొత్త నీళ్లు మార్కెట్లోకి వచ్చాయి.. ఈ బ్లాక్ వాటర్ ను విరాట్ కోహ్లీ మొదలుకొని మలైకా అరోరా, శృతిహాసన్ లాంటి ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ నీటిని తాగడానికి ముందుకొస్తున్నారు. వీటిని తాగడం వల్ల అందం తో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుందట.

ఈ బ్లాక్ వాటర్ ధర లీటర్ నాలుగు వేల రూపాయలు అంట.. అంత రేటు అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ..అంతకు మించి ధర కూడా వుంది. వీటికి ఎందుకంత ధర అంటే.. సాధారణంగా ప్రపంచంలోని ఫిట్ గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లీ కూడా ఒకడిగా నిలిచాడు . వీరు తినే ఆహారమే కాదు తాగే మంచినీళ్లు కూడా చాలా ప్రత్యేకం.. విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ కూడా అత్యంత పోషకాలతో నిండి ఉంటుంది. ఆల్కలైన్ నీళ్లలో పీ హెచ్ స్థాయిలు సాధారణ నీటికంటే ఎక్కువ 70కి పైగా ఖనిజ లవణాలు ఉంటాయి..అందుకే ఇవి నల్లగా ఉండటానికి కారణం.

రోగనిరోధక శక్తిని పెంచి, బరువును అదుపులో ఉంచుతాయి. అంతేకాదు చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.. బిపి ,మధుమేహం ,శరీరంలో కొవ్వు స్థాయి, అధిక ఒత్తిడి వంటి వాటినుంచి ఈ బ్లాక్ వాటర్ మంచి ఫలితాన్ని అందిస్తాయి.