డ్రగ్స్ విచారణ.. ఈడి ముందు హాజరు కానున్న నవదీప్..?

September 13, 2021 at 7:17 am

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ విషయం ఎక్కువగా పాపులర్ అవుతుంది. కొన్ని సంవత్సరాల కింద కేసు ఇప్పుడు ఈడీ అధికారులు మళ్లీ ఎంక్వయిరీ చేపట్టడం మొదలుపెట్టారు.ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కొంత మంది సెలబ్రిటీలను ఈ కేసులో ఈడీ అధికారులు విచారించారు. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్ ఛార్మి, మరో హీరో రవితేజ ను డ్రగ్స్ కేసులో విచారించారు ఈడి అధికారులు.

ఇక తాజాగా సోమవారం గచ్చిబౌలిలో మరో నటుడు నవదీప్ అని కూడా విచారించేందుకు ఈడి అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు సెలబ్రిటీలతో పాటు నవదీప్ ని సిట్ దర్యాప్తు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరోసారి మనీలాండరింగ్ కోణంలో ఇడి అధికారులు విచారిస్తున్నారు.

ఇప్పటివరకు ఒక్క సెలబ్రిటీస్ ని ఎనిమిది గంటలపాటు విచారించింది. డ్రగ్స్ మనీలాండరింగ్ వ్యవహారాలపై ప్రశ్నలను సంబంధించింది ఈ కేసు విదేశీ కెల్విన్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు ఈడి అధికారులు. ఈరోజు నవదీప్ కు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అని సినీ ఇండస్ట్రీలో ఉన్న నటులు ఆసక్తికరంగా చూస్తున్నారు. అలాగే తన బ్యాంక్ ఖాతా లావాదేవీలను కూడా ఈడికి వెల్లడించాల్సి ఉంటుంది.

 డ్రగ్స్ విచారణ.. ఈడి ముందు హాజరు కానున్న నవదీప్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts