పాపం.. రాత్రిళ్ళు ఫోన్ చేస్తే ఆ హీరోయిన్ బండబూతులు తిడుతోందట!

September 15, 2021 at 3:45 pm

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు, అలాగే కొంతమంది నటీమణులకు ఆఫర్లు ఇస్తామని చెప్పి లొంగ తీసుకోవడం అనేది ఒకప్పటి నుంచి జరుగుతోంది. కానీ ఇప్పట్లో ఈ విషయము సర్వసాధారణమైపోయింది. అయితే ఇలా ఎంతోమంది వారిని వేధించాడంటూ హీరోయిన్లు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు వారికి జరిగిన అన్యాయం గురించి నోరు విప్పారు. ఇలాంటి సంఘటనలు స్టార్ హీరోయిన్ ల జీవితంలో కూడా జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక హీరోయిన్ రాత్రిపూట ఫోన్ చేసి మరీ బూతులు తిడుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక స్టార్ హీరోయిన్ ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించడానికి సిద్ధమైంది. ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సినిమా చిత్ర బృందం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి విదేశాలకు వెళ్లారు. ఇది ఒక రోజు డైరెక్టర్ ఆ స్టార్ హీరోయిన్ కి రాత్రి సమయంలో ఫోన్ చేసి నీకు నా దర్శకత్వంలో మరొక సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాను ఈ నైట్ కి వస్తావా అని అడగడంతో వెంటనే చెలరేగిపోయిన హీరోయిన్ నువ్వు వద్దు నీ అవకాశాలు వద్దు.. వెధవ.. కావాలంటేఇప్పుడు ఇస్తున్న సినిమా నుంచి వెళ్లిపోమంటే వెళ్ళిపోతాను అంటూ  హీరోయిన్ బండ బూతులు తిట్టిందట.

ఆ మరుసటి రోజు ఉదయం షూటింగ్ కు వచ్చిన హీరోయిన్ నైట్ జరిగింది అంతా తనకు గుర్తు లేదు అన్నట్టుగా నవ్వుతూ హాయ్ డైరెక్టర్ గారుఅంటూ ఎంతో మర్యాదపూర్వకంగా పలకరించింది. ఇలా పగలు షూటింగ్లో ఉన్న సమయంలో నవ్వుతూ మాట్లాడుతూ రాత్రి అవ్వగానే ఆ హీరోయిన్ ఫోన్ చేసి మరి బూతులు తిడుతోందట. అయితే ఈ విషయాలన్నీ కూడా ఆ స్టార్ డైరెక్టర్ తన మిత్రులతో కలిసి మద్యం పార్టీ చేసుకుంటున్న సమయంలో తనకు జరిగిన అవమానాన్ని వారి స్నేహితులతో పంచుకున్నారట.పాపం ఈ డైరెక్టర్ కి వచ్చిన కష్టం మరరే డైరెక్టర్ కి రాకూడదు.

పాపం.. రాత్రిళ్ళు ఫోన్ చేస్తే ఆ హీరోయిన్ బండబూతులు తిడుతోందట!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts