సల్మాన్ ఖాన్ 30 ఏళ్ల సినిమాపై డాక్యుమెంటరీ.. ఎంత బాగుందో?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. దాదాపుగా మూడు దశాబ్దాలు సుదీర్ఘంగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని స్థాయి హీరోగా వెలుగుతున్నాడు.ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సినీ ప్రయాణంపై డాక్యుమెంటరీ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో ఆయన కుంటుంబ సభ్యులు, సహా నటులు, దర్శకులు, నిర్మాతలను ఇంటర్వూ చేయనున్నారు.

ఈ డాక్యుమెంటరీ ని విజ్ ఫిల్మ్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సల్మాన్ ఖాన్‌ ప్రొడ్యూస్‌ చేయనున్నారు . ఇది సల్మాన్ ఖాన్ సినీ ప్రయాణం, వివాదాలు, విఫల ప్రేమాయణాలపై ఉంటుందని తెలుస్తోంది. ఓటీటీలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.ఈ డాక్యుమెంటరీకి సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీమ్‌ఖాన్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ కలిసి కథ అందించనున్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ విదేశాలలో షూటింగ్‌ జరుపుకుంటున్నారు.టైగర్‌ సిరీస్‌లో మూడో భాగం టైగర్‌ 3 లోనూ, తన బావమరిదితో కలిసి అంతిమ్‌ మూవీలోనూ నటిస్తున్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై బిగ్‌బాస్‌ 15 షోకి హోస్ట్‌ చేయనున్నారు.