దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్స్..!

టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోయిన్లు తమ అందం కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటారు.అంతే కాకుండా వారు తినే ఆహారంలో కూడా ఎన్నో కండిషన్స్ పెట్టుకొని తింటూ ఉంటారు.మరికొంతమంది నటీమణులు తమ శరీరం అందంగా కనిపించే కోసం జిమ్ కెళ్ళి వర్కౌట్ చేస్తూ ఉంటారు.అయితే కొంతమంది హీరోయిన్లు కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు.ఆ వివరాలను చూద్దాం.

1).సమంత:
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందినది సమంత.ఈమెకు ఒకానొక సమయంలో స్కిన్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది.అందుచేతనే ఆమె తన నడుము దగ్గర చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

2).ప్రియాంక జవాల్కర్:
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఇక ఈమె థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లు గా సమాచారం.

3).స్నేహ ఉల్లాల్:
ఈ హీరోయిన్ ను చూసి అందరూ ఐశ్వర్య రాయి వచ్చింది అనుకున్నారు. కానీ ఈమె అనుకోకుండా బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధి బారిన పడింది.

4).నయనతార:
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార.ఈమె కూడా చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే కేరళ నుంచి కొన్ని ఆయుర్వేద మందులను తెచ్చుకొని వాడుతున్నట్లు గా సమాచారం.

అంతే కాకుండా టాలీవుడ్ లో రెజీనా మరికొంతమంది హీరోయిన్లు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.