నయనతార వల్ల నిర్మాతలకు కష్టాలు.. మరి అంత టార్చరా?

సినిమాను తెరకెక్కించాడు అంటే నిర్మాతలు ఆ చిత్ర బృందానికి అయ్యే ఖర్చు మొత్తం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హీరో కానీ హీరోయిన్ కానీ సినిమాకి వస్తుందంటే వారి వెంట సుమారుగా ఒక పదిమంది వరకు సిబ్బంది ఉంటారు. అలా వారు ఎక్కడికి వెళ్ళినా ఆ సిబ్బంది మొత్తం వాళ్ళతోనే ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు నిర్మాతలకు ఖర్చులు అన్నీ కలిపి చిరిగి చాట అవుతాయి. ఇదిలా ఉంటే తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో కూడా అద్భుతంగా నటించి సార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ హీరోయిన్ ఖర్చులను భరించ లేము అంటూ నిర్మాతలు చేతులెత్తి చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏమిటి?ఇప్పుడు మనం తెలుసుకుందాం..\

ఆ హీరోయిన్ ఎవరో కాదండోయ్ తెలుగులో, తమిళంలో తనదైన శైలిలో నటించి సార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార. ఈమె ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట సిబ్బంది మొత్తం వెళ్లడంతో వారికి ఫ్లైట్ టికెట్ అలాగే హోటల్ రూమ్స్ ఖర్చులు నిర్మాతలకు భారం కావడంతో నిర్మాతలు సైతం అనుభవించాలంటే చాలా కష్టంగా ఉందని కాబోతున్నారు. అంతే కాకుండా ఈ హీరోయిన్ ఒక సినిమాలో నటించింది అంటే సుమారుగా 5 లేదా 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. ఈమెకు రెమ్యూనరేషన్ అంత మొత్తంలో చెల్లించడమే కాకుండా తన సిబ్బందికి కూడా అదే స్థాయిలో ఖర్చు చేయాల్సి రావడంతో ఈ హీరోయిన్ ను సినిమాలలో తీసుకోవాలంటే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.ఈ విషయం పట్ల హీరోయిన్ తో కలిసి చర్చించాలి అన్న నిర్ణయానికి వచ్చారట నిర్మాతలు.