చెప్పులు ఉన్నందుకే ఈ నటిని అరెస్టు చేశారు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా నటీనటుల మీద కేసులు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి.ఇప్పుడు మలయాళ నటి నిమిషా కూడా చెప్పులేసుకుని ఫోటో తీసుకోవడం వల్ల ఆమే అరెస్టుకు దారితీసింది.అయితే ఈమె అలా ఎక్కడ వేసుకుంది ఎందుకు వేసుకుందో ఇప్పుడు చూద్దాం.

ఇక అసలు విషయానికొస్తే.. ఇమే చెప్పులేసుకొని ఏకంగా దేవుడు ఉత్సవపడవలోకి వెళ్లి అక్కడ ఫోటోలు దిగిందాన్నమాట.దేవాలయాల ఆచారాలను ఉల్లంఘించడం వల్ల ఈమెను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.శనివారం ఈమెని అరెస్ట్ చేసి ఆమెపై స్టేట్మెంట్లు నమోదు చేశారు.ఈ విషయాన్ని స్వయానా అక్కడి పోలీసులు తెలియజేశారు. అంతే కాకుండా తన స్నేహితుడితో కలిసి ఫోటోలు దిగడం వల్ల అతని పేరు కూడా రికార్డ్ లో ఉన్నట్లు తెలుస్తోంది

ఇక తన స్నేహితుడు ఈమె ఇద్దరు బెయిల్ మీద విడుదల అయ్యారు.ఇక దేవుడి ఉత్సవాలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వివాదానికి దారి తీసింది.ఇక కొంతమంది నెటిజన్లు,హిందూ వాదులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆ ఫోటోలను డిలీట్ చేయండి అంటూ ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.

అంతేకాకుండా ఆమెను బెదిరించిన వారిపై ఫిర్యాదు చేసి దాంతో తప్పు చేశానని ఒప్పుకున్నది.నాకు ఆ పడవలోకి ఎక్కడం తప్పు అనే విషయం తెలియదు అని తెలియజేసింది.ఏది ఏమైనా హిందువుల దేవాలయాల్లో కి చెప్పులు వేసుకుని వెళ్లిన కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి.

Share post:

Latest