బిగ్‌బాస్ 5: నోటి దూల‌తో అడ్డంగా బుక్కైన లోబో..ఆడుకుంటున్న నెటిజ‌న్స్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం గ్రాండ్‌గా స్టార్ అయిన విష‌యం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా.. వారిలో లోబో కూడా ఒక‌డు. ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన లోబో త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Lobo: Bigg Boss Telugu 5 contestant Lobo: Everything you need to know about the model-turned-actor - Times of India

ఇలాంటి త‌రుణంలో లోబోకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మార‌డంతో.. ఆయ‌న‌పై నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తూ ఆడుకుంటున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోబో బిగ్ బాస్ షో పట్ల నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్‌.. బిగ్‌బాస్‌ షో చూస్తుంటారా? మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా.. అందుకు లోబో `ఆ షో అంటే నాకు నచ్చదు. ఆ షోకి ఒక దండం అని అనేశాడు.

Bigg Boss Telugu 5 premiere episode LIVE UPDATES: From Ravi Kiran, Swetaa to Lahari Shari, here's complete list of contestants | Entertainment News,The Indian Express

దాంతో మీకు అవకాశం వచ్చినా అందుకే షోకి వెళ్లలేదా? అని యాంకర్ మరో ప్రశ్న అడుగగా… నాకు అవకాశం రాకపోవడమే మంచిది. నాకు ఆ షోకి వెళ్లాలని లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోనే నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఇప్పుడు సీజ‌న్ 5లో లోబో పాల్గొన‌డంతో.. నెటిజ‌న్లు అత‌డిని ఏకిపారేస్తున్నారు. మొత్తానికి లోబో నోటి దూల‌తో అడ్డంగా బుక్కైయ్యాడు.

https://twitter.com/HeeZG0n3/status/1434734442753318916?s=20