భావోద్వేగానికి గురైన జెస్సీ తల్లి.. ఎందుకంటే?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ మోడల్ జెస్సి ఎవరు ఎవరు అనేది మనలో చాలా మందికి తెలియదు. జెస్సీ మోడలింగ్ రంగంలో పలు అవార్డులను అందుకున్నాడు. అంతేకాకుండా ఎంత మంచి వాడవురా సినిమా లో కూడా నటించారు. ఇక ఇటీవలే మొదలైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో లో కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇందులో అతడి అమాయకత్వాన్ని మిగతా కంటెస్టెంట్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మరికొన్నిసార్లు అయితే జెస్సీ అనవసరంగా ఆవేశపడి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఈవారం జెస్సీ నామినేషన్ లో ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా చేసి తల్లి సునీత మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జెస్సీ ఈ గురించి ఈ విధంగా తెలిపింది. జెస్సి అన్నింటిలోనూ యాక్టివ్ గా ఉంటాడని, కాకపోతే బిగ్ బాస్ షో కి వచ్చిన మొదటి వారమే నామినేషన్ లోకి రావడంతో అతడు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు అని తెలిపింది. అలాగే తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా తక్కువగా ఉండటంతో జెస్సి డౌట్ పడుతున్నాడు అంటూ తన తల్లి తెలిపింది. అయితే జస్ట్ చదువుకుంటున్న రోజుల్లోనే తన తండ్రి మరణించడంతో ఆ బాధ తననీ ఒక్కసారిగా కుంగదీసిందని, ఇప్పుడు బిగ్ బాస్ తన కొత్త జీవితాన్ని ఇస్తుందని వచ్చాడు అంటూ తన తల్లి ఎమోషనల్ అయ్యింది.