18 పేజెస్ లేటెస్ట్ అప్డేట్.. లుక్ లో మెరిసిపోతున్న అనుపమ?

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇందులో అనుపమ నందిని పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని నందిని పాత్రకు సంబంధించి ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా, ఈ వీడియోలో అనుపమ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తుంది.

నిఖిల్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాతో మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఆ మధ్య ఒక సారి ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు. అయితే తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఇందులో ఆమె తమ పాత్రను పరిచయం చేస్తున్నట్లు ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. అందులో సీతాకోకచిలుక ఎగురుతూ అనుపమ చేతి పై వాలినట్టుగా కనిపిస్తుంది. ఈ పోస్టర్ లో అనుపమ లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.