షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ బిల్లెతెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్లొన్నాడు. వీడియోలతో యూట్యూబ్‌ను షేక్ చేసే షన్నూ..హౌస్‌లో మాత్రం అంత ఎనర్జిటిక్‌గా ఉండలేకపోతున్నాడు.
అయితే ఎట్టకేలకు షణ్ను కెమెరా ముందు కాస్త సందడి చేశారు. సందడి చేయడమే కాదు… హౌస్‌లో తన కో పార్టిసిపెంట్ నటి ఉమాదేవి విషయంలో తెగ ఫీల్ అయిపోయాడు. అసలు ఇంతకీ ఉమాదేవి విషయంలో షణ్ముఖ్ ఫీల్ అవ్వడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. హౌస్‌లో ఉమాదేవి ఉగ్రరూపంతో అందరినీ వణికిస్తోంది. చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ తెగ ఆవేశపడిపోతోంది.
దాంతో ఇతర కంటెస్టెంట్లు ఆమెతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని భావిస్తున్నారు. అయితే తాజాగా ఆమె గురించి సిరి, కాజల్ దగ్గర ఓపెన్ అయ్యాడు షణ్ముఖ్. తాజా ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడుతూ..`ఉమ తనతో మాట్లాడటం లేదని.. ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. నిజానికి ఆమెను మొన్న నామినేట్ చేయాలనుకున్నా.. కానీ తల్లి పేరు(ఉమ) కూడా అదే కావడంతో వదిలేసి తప్పు చేశా` అని చెబుతూ ఫీల్ అయ్యాడు. దాంతో షణ్ను కామెంట్స్ వైరల్‌గా మారాయి.