ఆఫ్రికా ఖండం లో వినాయక సందడి ఎలా చేస్తారో చూస్తే షాక్.. వీడియో మీకోసం..!

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా నిబంధనలు పాటిస్తూ, వినాయక చవితి ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాలలో వినాయక నిమజ్జనం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. ఎందుకంటే కరోనా కాలంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తే కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది అనే భయం లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే నిమజ్జనం ఎలాంటి ఆడంబరాలూ లేకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఇక్కడే కాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక పూజలు ఎంతో ఘనం గా జరుపుకున్నారు.

ఇకపోతే ఆ దేశం లో వినాయక పూజలు ఎలా చేశారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. ఆఫ్రికా ఖండంలోని ఏంటేబి అనే ప్రాంతంలో ఆటవిక జాతుల వారు శ్రీ మహా గణనాథుని ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఆడ ,మగ ,చిన్న , పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వినాయకుడి సందడిలో మునిగిపోయి ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు.. పెద్ద పెద్ద మేళాలు, డ్రమ్స్ లతో, తాప్పెట్లు , తాళాల మధ్య వినాయకుడి పూజలు ఎంతో సందడిగా జరుపుకున్నారు. గణపతి బప్పా మోరియా అంటూ భూమి దద్దరిల్లేలా వారు చేసే సందడి చూడడానికి కన్నుల పండుగగా అనిపించింది.. ఆడవాళ్లు కూడా వాయిద్యాలు వాయిస్తూ ఎంతో సంబరంగా వినాయకుడి నిమజ్జనం కోసం ఊరేగింపుగా వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.https://m.facebook.com/story.php?story_fbid=2349114611887859&id=733129126819757