ఆధార్ కార్డు లో ఫోటో ని ఇలా సులువుగా మార్చుకోండి..?

ఇప్పుడు ఏదైనా బ్యాంకింగ్ సేవలు కావాలన్నా, ఏదైనా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ పథకాలు పొందాలన్న కంపల్సరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే ఇందులో ఉండే ఫోటోని మార్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రతి ఒక్కరు.అయితే ఆ ఫోటో ని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1). ముందుగా..UIDAI వెబ్ సైట్ కి వెళ్ళాలి.

2). ఆ తర్వాత ఆధార్ కార్డు నమోదు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

3). ఇక మన పూర్తి వివరాలతో ఆ ఫారమ్ ను పూర్తి చేయాలి.

4). అలా ఫిలప్ చేసిన తర్వాత మన దగ్గర్లో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.

5). అక్కడ ఆధార్ కార్డ్ సంబంధించి ఫారమ్ను వారికి సమర్పించాలి.

6). ఆ తర్వాత బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా మీ వివరాలను ధృవీకరించండి.

7). ఆధార్ కార్డు సేవ కేంద్రం లో క్యాప్చర్ చేయబడిన ఒక అధికారిక ఫోటోలు పొందండి.

8). మీ ఫోటో అప్లోడ్ చేయడానికి.. 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

9). మీ అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ను URN చూపించే రసీదు చెప్పను స్వీకరించండి.

10).UIDAI వెబ్సైట్లో అధికారిక హోదా ఉంది అభ్యర్థనకు స్టేటస్ను చేయడానికి మీరు ఈ URN ని ఉపయోగించు కోవచ్చు.

11) ఇక అధికారిక ఫోటోతో ఆధార్ కార్డ్ ఇ- కాఫీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక అంతే కాకుండా దీనిని ఒరిజినల్ కాపీ కావాలంటే..UIDAI అనే వెబ్ సైట్ కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఫోటో మాత్రమే కాకుండా, మొబైల్ నెంబర్, అడ్రస్ వంటి ఇతర వివరాలను కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు.