చిరిగిన జీన్స్‌లో ప్రియ‌మ‌ణి ఒంపుసొంపులు..అదిరిన లేటెస్ట్ పిక్స్!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేసి మంచి న‌టిగా త‌నేంటో నిరూపించుకుంది. ఇక వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను పెళ్లి చేసుకున్నాక‌ కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ప్రియ‌మ‌ణి.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జోరుగా దూసుకుపోతోంది.

ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌లే కాకుండా టీవీ షోలతో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అంతేకాదు, సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కు మంచి కిక్ ఇస్తోంది.

తాజాగా కూడా చిరిగిన జీన్స్, వైట్ టీ షర్ట్ ధరించి ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ ఒంపుసొంపులు పోయింది. కిర్రాక్‌గా ఉన్న ప్రియ‌మ‌ణి లేటెస్ట్ లుక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు..వ‌య‌సు పెరుగుతున్నా ప్రియ‌మ‌ణి అందాలు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.